లోకాస్ట్ పాలీహౌజ్‌లో లోపాల్లేవు | there is no fault in low cost poly house says dr. prabhakar rao | Sakshi
Sakshi News home page

లోకాస్ట్ పాలీహౌజ్‌లో లోపాల్లేవు

May 9 2015 5:05 AM | Updated on Sep 3 2017 1:40 AM

ప్రకృతి వ్యవసాయం’పై శిక్షణా శిబిరంలో వెదురు బొంగులతో పాలీహౌజ్ నిర్మాణాన్ని వివరిస్తున్న డా. బండి ప్రభాకర్ రావు

ప్రకృతి వ్యవసాయం’పై శిక్షణా శిబిరంలో వెదురు బొంగులతో పాలీహౌజ్ నిర్మాణాన్ని వివరిస్తున్న డా. బండి ప్రభాకర్ రావు

ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఖరీదైన పాలీహౌజ్‌లో డిజైన్‌పరమైన లోపాలున్నాయని శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ట్రస్టీ, లోకాస్ట్ పాలీహౌజ్ నమూనా రూపశిల్పి డా. బండి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.

హైదరాబాద్: ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఖరీదైన పాలీహౌజ్‌లో డిజైన్‌పరమైన లోపాలున్నాయని శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ట్రస్టీ, లోకాస్ట్ పాలీహౌజ్  నమూనా రూపశిల్పి డా. బండి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. అయితే తాము స్థిరీకరించిన లోకాస్ట్ పాలీహౌజ్ నమూనా లోపరహితమైనదన్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ తోడ్పాటుతో రెడ్‌హిల్స్‌లోని ఉద్యాన శిక్షణ సంస్థలో శుక్రవారం నిర్వహించిన రైతుల శిక్షణా శిబిరంలో పాల్గొని దీనిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్, నెట్, నట్లు, బోల్టుల కొనుగోలుకు చదరపు మీటరుకు రూ. 55 లేదా చదరపు అడుగుకు రూ. 5.35 మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ పద్ధతిలో పాలీహౌజ్‌ను నిర్మించుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. లోకాస్ట్ పాలీహౌజ్‌లలో ప్రకృతి వ్యవసాయంపై తెలంగాణ ఉద్యాన శాఖతో అవగాహన ఒప్పందం కుదిరిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఏపీ ఉద్యాన శాఖ కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తోందన్నారు. ఇరు తెలుగు  రాష్ట్రాల్లో రైతులు, నగరాల్లో ఇంటిపంటల సాగుదారులకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం జూలైలో మాస్టర్ ట్రైనర్లకు 15 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ శిబిరం నిర్వాహకురాలు సీహెచ్ ఉమామహేశ్వరి, ఉద్యాన అధికారులు అరుణ, పద్మనాభ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement