పార్టీ మార్పుపై ఇప్పటికి నో కామెంట్స్ | theegala krishna reddy denies news of party hopping | Sakshi
Sakshi News home page

పార్టీ మార్పుపై ఇప్పటికి నో కామెంట్స్

Oct 1 2014 10:27 AM | Updated on Mar 22 2019 6:18 PM

పార్టీ మార్పుపై ఇప్పటికి నో కామెంట్స్ - Sakshi

పార్టీ మార్పుపై ఇప్పటికి నో కామెంట్స్

టీడీపీ సీనియర్ నాయకుడు, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దసరాలోపు పార్టీ మారతారన్న విషయానికి ప్రస్తుతానికి ఒక కామా పడింది.

టీడీపీ సీనియర్ నాయకుడు, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దసరాలోపు పార్టీ మారతారన్న విషయానికి ప్రస్తుతానికి ఒక కామా పడింది. ఇప్పట్లో తాను పార్టీ మారకపోవచ్చునంటూ తీగల స్వయంగా వెల్లడించారు. కార్యకర్తలతో చర్చిస్తున్నానని, వాళ్ల మనోభావాలకు అనుగుణంగా, వాళ్లు ఏం చెబితే అదే చేస్తానని ఆయన అన్నారు. తాను 33 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు నిర్వర్తించానని తీగల తెలిపారు. తాను పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడే ఉన్నానని, చంద్రబాబు కంటే కూడా పార్టీలో సీనియర్నని ఆయన కార్యకర్తలతో చెప్పారు.

(టీఆర్ఎస్లోకి తీగల?)

త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తన నియోజకవర్గంతో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే తాను కోరుకుంటున్నానని, అభివృద్ధిలో అందరం భాగస్వాములం కావాలని చెబుతానని అన్నారు. కార్యకర్తలు ఏం చెబుతారో చూడాలన్నారు. దసరాలోపు పార్టీ మారతానన్న విషయమై మాత్రం నో కామెంట్స్ అనేశారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని, వాళ్లు ఏమంటే దానికే కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement