రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక సాయం కింద మంగళవారం రూ.450 కోట్లు విడుదల చేసింది.
రెండో విడత నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక సాయం కింద మంగళవారం రూ.450 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని వెనుకబడిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం (పాత) జిల్లాలకు 2016–17 ఆర్థిక సంవత్స రానికి ప్రత్యేక సహాయంగా ఈ నిధులు విడుదల చేసింది. గతేడాది మొదటి విడతగా కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.900 కోట్లు ప్రత్యేక సాయం అందింది.
ఆయా జిల్లాల్లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు వీటిని ఖర్చు చేయాలని కేంద్రం నిర్దేశించింది. హైదరాబాద్ మినహా తొమ్మిది పాత జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఈ నిధులను మంజూరు చేసింది. కేంద్రం ప్రత్యేక సాయం కింద నిధులు విడుదల చేయడం పట్ల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి హర్షం వ్యక్తం చేశారు.