భవిష్యత్తు అంతా కమ్యూనిస్టులదేనని ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి ఎండీ. గౌస్ అన్నారు.
ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి ఎండీ. గౌస్
రేబల్లె(దుగ్గొండి) : భవిష్యత్తు అంతా కమ్యూనిస్టులదేనని ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి ఎండీ. గౌస్ అన్నారు. ఈ నెల 5న విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో గౌస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం తొలిసారి రేబల్లెకు వచ్చిన ఆయన అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు.
అనంతరం గౌస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమన్నారు. దీనిపై కమ్యూనిస్టులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు గాదెగోని రవి, సింగతి సాంబయ్య, భూమయ్య, నాగెల్లి కొమురయ్య, హంసారెడ్డి, కుసుంబ బాబురావు, తదితరులు పాల్గొన్నారు.