విష గుళికలు తిని పది నుంచి పన్నెండు నెమళ్లు అనుమానాస్పంగా మృతిచెందిన సంఘటన..
చేర్యాల : విష గుళికలు తిని పది నుంచి పన్నెండు నెమళ్లు అనుమానాస్పంగా మృతిచెందిన సంఘటన మండల కేంద్రం శివారు పల్లె కర్షకనగర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. పల్లె కర్షకనగర్ సమీపంలోని దర్గా వద్ద పది నుంచి 12 నెమళ్లు అనుమానాస్పదంగా మృతిచెందగా.. అందులో ఆరు నెమళ్ల కళేబరాలు మాత్రమే ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తు లు విషపూరితమైన మొక్కజొన్న గింజలను పోయడంతో వాటిని తిని నెమళ్లు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సయ్యద్ హుస్సే న్ సంఘటన స్థలానికి చేరుకొని నెమళ్ల కళేబరాలకు వైద్యులతో పోస్టుమార్టం చేరుుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెమళ్ల మృతిపై విచారణ జరిపించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు.