నగరంపై ‘నిఘా’ నేత్రాలు | The city of 'intelligence' eyes | Sakshi
Sakshi News home page

నగరంపై ‘నిఘా’ నేత్రాలు

May 6 2015 4:52 AM | Updated on Sep 3 2019 9:06 PM

నగరంలో నేరాలకు చెక్ పెట్టేందుకు, నేరగాళ్లు.. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది.

ఖమ్మం క్రైం: నగరంలో నేరాలకు చెక్ పెట్టేందుకు, నేరగాళ్లు.. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నగరంపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తోంది. నగరంలోని ప్రధాన కేంద్రాలలో ఈ కెమెరాలు నిరంతరం ఓ కన్నేసి ఉంచుతాయి.
 
20కి పైగా కేంద్రాలలో...
నగరంలో వ్యాపార కూడళ్లు, అపార్ట్‌మెంట్లు, పెట్రోల్ బంక్‌ల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటయ్యూయి. పోలీస్ శాఖ కూడా నగరంలోని 20కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను అతి త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ కెమెరాలు మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి నగరానికి వచ్చాయి. నగరానికి చేరిన ఈ సీసీ కెమెరాలు అత్యంత నాణ్యమైనవని పోలీస్ శాఖ చెబుతోంది. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందనే అంశంపై ఎస్పీ షానవాజ్ ఖాసిం ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్ కసరత్తు చేస్తున్నారు. పలువురి అభిప్రాయూలను ఆయన తెలుసుకుంటున్నారు.
 
ముఖ్యంగా జిల్లా కేంద్రాలలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగడంతో వీటికి పాల్పడే వారు తాము నేరం చేసిన తర్వాత పారిపోవడం, వారిని గుర్తించడంలో పోలీస్ శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది.  ఈ మేరకు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరం చేసిన వారు ఎక్కడికి వెళ్లారనేది.. ఏవైపు ప్రయాణించారనేది సీసీ టీవీ పుటేజీల ద్వారా తెలిసిపోవడంతోపాటు నేరానికి పాల్పడిన వారు సైతం పోలీస్‌శాఖకు దొరికే అవకాశం తప్పక ఉంటుంది.
 
నేరగాళ్లను పట్టుకోవడం తేలిక
- సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలున్నారుు. ప్రధానంగా నేరగాళ్లను గుర్తించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నారుు.
- నగరంలోని జడ్పీ సెంటర్‌లో గత సంవత్సరం నిషాంత్ అనే బాలుడిని అతని బాబాయి చింతగుండ్ల మధు తీసుకెళ్లి చంపేశాడు. బాలుడిని మధు తీసుకెళుతున్న దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. పోలీసుల దర్యాప్తులో ఈ కెమెరా ఫుటేజీ కీలకంగా మారింది. హంతకుడు మధును పోలీసులు పట్టుకున్నారు.
- నగరంలోని మయూరి సెంటర్‌లోగల ఓ బార్‌లో.. ఓ వ్యక్తిని మద్యంలో విషం కలిపి కొందరు హత్య చేశారు. ఇక్కడ కూడా నేరస్తులను పట్టిచ్చింది సీసీ కెమెరాలే.
- గత సంవత్సరం సత్తుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీలు చేసిన దొంగలను అప్పటి డీఎస్పీ అశోక్‌కుమార్ పట్టుకుని దాదాపు రూ.90లక్షలకు పైగా సొత్తును తిరిగి రాబట్టారు. ఈ కేసు దర్యానప్తులో అక్కడి సీసీ కెమెరా ఫుటేజీ దోహదపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement