‘ప్రాదేశిక’ ఓటర్లు 57,789

'Territorial' Voters 57,789 - Sakshi

ముసాయిదా విడుదల చేసిన అధికారులు

నేడు రాజకీయపార్టీల నేతలతో సమావేశం

27న తుదిజాబితా ప్రదర్శన

సాక్షి, కరీంనగర్‌రూరల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో 24,402, కరీంనగర్‌రూరల్‌ మండలంలో 33,387 ఓటర్లు, మొత్తం 57,789 మందితో కూడిన కొత్త ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారులు శని వారం విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలున్నట్లయితే ఈనెల 20వరకు లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 27న ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కరీంనగర్‌ మండల పరిషత్‌ సమావేశమందిరంలో కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన రాజకీయపక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయపార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో పవన్‌కుమార్‌ కోరారు.

ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు
ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో స్థానిక నాయకులు పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం చేస్తూ నే మరోవైపు ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు మద్దతు కూడగట్టుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో ఉండటంతో రిజర్వేషన్ల ప్రకా రం పోటీచేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు నాయకులు మరోమారు పోటీ చేసేం దుకు సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్లు కలి సిరాని నాయకులు తమ భార్యలను బరిలో దిం చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కరీంనగర్‌రూరల్‌ మండలంలో మొత్తం 12, కొత్తపల్లి మం డలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కరీంనగర్‌రూరల్‌ ఎంపీపీ పదవి జనరల్, కొత్తపల్లి ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు నాయకులు ఎంపీపీ పదవికోసం పావులు కదుపుతున్నారు. కరీంనగర్‌ ఎంపీపీ కోసం జనరల్‌ ఎంపీటీసీస్థానాలైన బొమ్మకల్‌–2, నగునూరు–2, గోపాల్‌పూర్, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి ఎంపీటీసీలకు అవకాశముంది. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీపీ కోసం బావుపేట–1, చింతకుంట–1, నాగులమల్యాల ఎంపీటీసీ స్థానా ల నుంచి మహిళలకు అవకాశముంది. దీంతో ఈస్థానాల నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు నాయకులు పోటిచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. స్థానిక నాయకుల నుంచి అవసరమైన మద్దతు కూడగట్టుతున్నారు.

సతీమణులకు అవకాశం
కరీంనగర్‌రూరల్‌ జెడ్పీటీసీ స్థానం జనరల్‌ మ హిళ, కొత్తపల్లి జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు కేటాయించడంతో అధికారపార్టీకి చెందిన పలువు రు నాయకులు తమ భార్యలను రంగంలోకి దిం పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మద్దతు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్‌రూరల్‌ జెడ్పీటీసీ కోసం టీఆర్‌ఎస్‌ నుంచి బొమ్మకల్, చేగుర్తి మాజీ సర్పంచులు పురుమల్ల లలిత, బల్మూరి భాగ్యలక్ష్మి, దుర్శేడ్‌ ఎంపీటీసీ కోరుకంటి శోభరాణి, బీజేపీ నుంచి మొగ్ధుంపూర్‌ మాజీ సర్పంచ్‌ తాళ్లపల్లి లక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ నుంచి ఇరుకుల్ల మాజీ సర్పంచ్‌  మారుతీరావు సతీమణి శ్వేత పోటీచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

కొత్తపల్లి జెడ్పీటీసీ కోసం బావుపేటకు చెందిన పిల్లి మహేశ్‌గౌడ్, మల్కాపూర్‌మాజీ సర్పంచ్‌ కాసారపు శ్రీనివాస్‌గౌడ్, ఎలగందల్‌కు చెందిన మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు నిమ్మ ల అంజయ్య తదితరులు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఓటర్ల వివరాలు

మొత్తం  ఓటర్లు   57,789
కొత్తపల్లి మండలం             24,402
కరీంనగర్‌రూరల్‌ మండలం      33,387

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top