శంషాబాద్‌ విమానాశ్రయం దశాబ్ది వేడుకలు

Tenth Anniversary Celebrations Of Shamshabad Airport - Sakshi

హైదరాబాద్‌ : రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్‌ హైదరాబాద్‌) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జీఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేసిన దశాబ్ది వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2008లో ప్రారంభమైన విమానాశ్రమం క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. హైదరాబాద్‌ కీర్తిని పెంచుతూ, సిటీ ఐకాన్‌గా నిలిచింది. ఈ దశాబ్ది వేడుకల్లో డెకెడ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్టాంప్‌తోపాటు, ఎన్వలప్‌ని విడుదల చేశారు. జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వంతో మూడు ఎంవోయూలపై సంతకాలు చేశారు.

విస్తరణ పనులకు శంకుస్థాపన:
శంషాబాద్‌ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అదే విధంగా దేశంలో అతి పెద్ద కన్వెక్షన్‌ సెంటర్‌కు శిలాఫలకం ప్రారంభించారు. దేశంలోనే మెట్టమొదటి స్మార్ట్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీని కూడా ఆయన ప్రారంభించారు. ఏడాదికి కోటి ఇరవై లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో  విమానాశ్రయం ప్రారంభమైన భవిష్యత్తులో  ఏడాదికి నాలుగు కోట్ల మందిని తట్టుకునేలా విస్తరణ చేపడతామని జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో జీఎంఆర్‌ చైర్మన్‌ గ్రంధి మలికార్జునరావు, మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి, సినీ నటుడు రామ్‌చరణ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top