పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పెంపు | Telangana POLYCET 2020 Application Date Extended Till 31st May | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

Published Sat, May 9 2020 4:29 AM | Last Updated on Sat, May 9 2020 4:29 AM

Telangana POLYCET 2020 Application Date Extended Till 31st May - Sakshi

పాలిసెట్‌–2020 దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్‌ఎన్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలిసెట్‌–2020 దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్‌ఎన్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అలాగే పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరంలో ఐటీఐ పూర్తయిన విద్యార్థులు చేరేందుకు నిర్వహించే ల్యాటరల్‌ ఎంట్రీ ఇన్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement