ప్లీనరీకి తరలిరండి | Telangana Plenary | Sakshi
Sakshi News home page

ప్లీనరీకి తరలిరండి

Apr 24 2015 1:41 AM | Updated on Sep 3 2017 12:45 AM

టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు సకాలంలో తరలి రావాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కరీంనగర్ : టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు సకాలంలో తరలి రావాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
  ప్లీనరీ విషయమై కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డిలతో గురువారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో చర్చించారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 300 నుంచి 400 మంది ప్రతినిధులు విధిగా హాజరుకావాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మే యర్లు, మున్సిపల్ చైర్మన్లు, డివిజ న్, మండలా ల బాధ్యులు ప్లీనరీకి తరలిరావాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement