రేపే మలి విడత  

Telangana Panchayat Second Phase Elections Tomorrow - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: బోధన్‌ డివిజన్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్త య్యాయి. బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిపోగా ఈనెల 25న ఎన్నికలు జరుగనున్నా యి. ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒం టి గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి అభ్యర్థులను ప్రకటిస్తారు.  డివిజన్‌లోని బోధన్, కోటగిరి, రెంజల్, రుద్రూ రు, వర్ని, ఎడపల్లి మండలాల్లో 142 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది.

ఈనెల 11న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 13న నామినేషన్ల ముగింపు, ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. 33 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానా లు ఏకగ్రీవం కాగా, 109 స్థానాలకు ఎన్ని కలు జరుగనున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు  336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,296 వార్డు లు ఉండగా ఇందులో 452 వార్డు స్థానాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా 844 వార్డులకు ఎన్నికలు జరుగనున్నా యి. వార్డు స్థానాలకు 2,002 మంది  బరిలో ఉన్నారు.

కుల సంఘాలకు..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియగానే, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. సర్పంచ్‌ బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో కులసంఘాలు, యు వజన సంఘాలకు విందులు ఏర్పాటు చేస్తున్నా రు. మహిళా సంఘాలకు శీతల పానీయాలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి మద్యం అందిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తమకు కేటాయించిన గుర్తులను వస్తువులుగా అభ్యర్థులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కులసంఘాలు, యువజన సంఘాల సభ్యులకు రోజూ విందులు ఇస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top