వచ్చే నెల నుంచి పీఆర్సీతో కూడిన జీతం | telangana employees to get prc next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెల నుంచి పీఆర్సీతో కూడిన జీతం

Apr 6 2015 5:08 PM | Updated on Sep 2 2017 11:56 PM

గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగుల కల ఫలించనుంది. వచ్చే నెల జీతంలో పీఆర్సీతో కూడిన జీతాన్ని తెలంగాణ ఉద్యోగులు అందుకోనున్నారు.

హైదరాబాద్:త్వరలో తెలంగాణ ఉద్యోగుల నిరీక్షణ ఫలించనుంది. వచ్చే నెల జీతంలో పీఆర్సీతో కూడిన జీతాన్ని తెలంగాణ ఉద్యోగులు అందుకోనున్నారు. ఈ మేరకు సోమవారం ఉద్యోగుల పీఆర్సీ వర్తింపు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆర్థికశాఖ జీవో విడుదల చేసింది.  పీఆర్సీ ద్వారా పెరిగే జీతభత్యాలను వచ్చే నెల జీతంతో ఉద్యోగులకు అందజేయనున్నారు. మార్చి నెలకు సంబంధించిన బకాయిలను ఈనెలలోనే చెల్లించనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది.

 

ఇదిలా ఉండగా తొమ్మిది నెలల బకాయిలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధివిధానాలను టీఎస్ ప్రభుత్వం ప్రకటించలేదు. పీఆర్సీ బకాయిల చెల్లింపునకు సంబంధించి బాండ్ల జారీకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నా.. దానిపై ఇంకా సందిగ్ధత మాత్రం వీడలేదు.ఆ బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా?లేక బాండ్ల జారీనా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి రానుంది.

 

గత నెల్లో పీఆర్సీ ఫిట్మెంట్ జీఓ విడుదలైన సంగతి తెలిసిందే. పీఆర్సీ ఫిట్మెంట్ను 43 శాతంగా నిర్ణయిస్తూ మార్చి 18 వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement