మొత్తం సొమ్ము విడుదల చేసి న్యాయవాదులను ఆదుకోండి!

Telangana Bar Council Requested CM KCR Financial Support to Needy Advocates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసినందుకు గాను న్యాయవాదులందరి తరుపున తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు అనంతసేన్‌ అకుల ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదులకు సాయం చేయడంలో తోడ్పాటు అందించినందుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి,  తెలంగాణ బార్‌కౌన్సిల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌కు, లా సెక్రటరీకి   ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 15కోట్ల రూపాయాలను ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకోవడానికి ఖర్చు చేశారు. (అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం)

కరోనా కారణంగా అ‍త్యవసరమున్న సివిల్‌, క్రిమినల్‌ కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా విచారిస్తున్నారు. దీని  కారణంగా కేవలం ఇదే వృత్తిపై ఆధారపడిన న్యాయవాదులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసరాలు తీరడం కూడా కష్టంగా మారి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క న్యాయవాదికి రూ.10,000 చొప్పున సాయం అందించింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు రూ.15 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బార్‌కౌన్సిల్‌ సభ‍్యులు అనంతసేన్‌ అకుల్‌ విజ్ఞప్తి చేశారు. (మరో హామీ అమలుకు శ్రీకారం )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top