సియాచిన్‌లో తెలంగాణ జవాను దుర్మరణం | telangana Army Jawan killed in the Siachen | Sakshi
Sakshi News home page

సియాచిన్‌లో తెలంగాణ జవాను దుర్మరణం

Dec 27 2015 12:26 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నవ్‌గామ్‌బస్తీకి చెందిన ఓ యువ ఆర్మీ జవాను జమ్మూ కాశ్మీర్‌లోని సియాచిన్ పర్వత ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గాయపడి మృతి చెందాడు.

ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నవ్‌గామ్‌బస్తీకి చెందిన ఓ యువ ఆర్మీ జవాను జమ్మూ కాశ్మీర్‌లోని సియాచిన్ పర్వత ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గాయపడి మృతి చెందాడు. వైశాఖ సంతోష్‌కుమార్(29) 9 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా చేరాడు.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ నెల 24న అతడు కాలు జారి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్చగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. అతడి మృతదేహం ఆదివారం నవ్‌గామ్‌బస్తీకి తీసుకురానున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement