8వ తరగతి విద్యార్థిని పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన | teacher misbehaves with 8th class student | Sakshi
Sakshi News home page

8వ తరగతి విద్యార్థిని పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన

Mar 14 2015 3:02 PM | Updated on Mar 28 2018 11:08 AM

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలిసింది.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వనస్థలిపురంలోని సదరు స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసే హేమకుమార్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. శనివారం స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా సదరు విద్యార్థిని చీర కట్టుకుని వచ్చింది. కాగా హేమకుమార్ ఆ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో... బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ వద్దకు చేరుకుని అద్దాలు ధ్వంసం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement