టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ | tdp, mrps activits clash in nizamabad | Sakshi
Sakshi News home page

టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ

Dec 27 2014 3:09 PM | Updated on Oct 17 2018 6:06 PM

టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ - Sakshi

టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ

నిజామాబాద్లో టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ సృష్టించారు.

హైదరాబాద్: నిజామాబాద్లో టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ సృష్టించారు. శనివారం మధ్యాహ్నం నిజామాబాద్ టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రమణ, రేవంత్ రెడ్డిని ఘోరావ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తీర్మానం చేయలేదని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడికి దిగి చితకబాదారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement