ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట గ్రామానికి చెందిన సవనం మౌనిక (16) అనే విద్యార్థిని టెన్త్ పరీక్ష తప్పింది.
ఖమ్మం : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట గ్రామానికి చెందిన సవనం మౌనిక (16) అనే విద్యార్థిని టెన్త్ పరీక్ష తప్పింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆ విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. మౌనిక అనంతారం ఐటీడీఎస్ పాఠశాలలో చదివింది.