హాస్టల్లో యువతి ఆత్మహత్య | student committed suicide in hostel room | Sakshi
Sakshi News home page

హాస్టల్లో యువతి ఆత్మహత్య

Jan 27 2015 8:19 PM | Updated on Sep 2 2017 8:21 PM

ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. కరీంనగర్ జిల్లా ఆత్మానగర్ గ్రామానికి చెందిన వసుంధర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ లోని ప్రైవేటు హాస్టలో ఉంటోంది.

మంగళవారం మధ్యాహ్నం ఆమె భోజనానికి రాకపోవడంతో అనుమానమోచ్చిన హాస్టల్ సిబ్బంది గది తలుపులు కొట్టారు. ఎంత కోట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూసే సరికి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆత్మహత్య చేసుకొవడానికి కారణాలేంటో తెలియారాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement