అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామశివారు ...
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బావ మరుదులు చంపారని మృతుడి బంధువుల ఆరోపణ
మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామశివారు కంబాలబండ తండాలో శుక్రవారం జరి గింది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై సీహెచ్.శ్రీనివాస్ కథనం ప్రకారం.. కంబాలబండ తండాకు చెందిన బానోత్ రవి(28)కి భార్య శారద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలసి ఈ నెల 24న మంగళవారం సాయంత్రం శారద తల్లిగారి ఊరైన ఇదే మం డలంలోని లక్ష్మిపురం(బ్రాహ్మణపల్లి) శివారు కొమ్ముగూడెంపైతండాలో ముత్యాలమ్మపండుగకు వెళ్లారు. 25న ముత్యాలమ్మపండుగ వేడుక ముగిశాక 26వ తేదీ గురువారం ఉదయం బానోత్ రవి అనారోగ్యంగా ఉంద ని చెప్పగా అతడిని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిం చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. రవి మృతదేహాన్ని మల్యాల శివా రు కంబాలబండతండాకు గురువారం రాత్రి తీసుకెళ్లారు.
శుక్రవారం ఉదయం బానోత్ రవికి అంత్యక్రియలు చేద్దామని చూస్తుండగా అతడి ఒంటిపై గాయాలు కనిపించాయంటూ మృతుడి బంధువులు రవి మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కాగా మృతుడి తల్లి ఆలేరి మంగ మ్మ, అన్న శ్రీను మాత్రం రవి మృతికి అతడి అత్త ఆంగోత్ కాలి, బావమరుదులు రవి, బాబల్ కారణమని ఆరోపించారు. వారు రవి ని తీవ్రంగా గాయపరచటం వల్లే మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రవి బంధువులను ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పరామర్శించి ఓదార్చారు. వారికి న్యాయం జరిగేలా చూడాలని, దోషులను శిక్షించాలని రూరల్ ఎస్సై శ్రీనివాస్‌కు చెప్పారు. మృతుడి అన్న శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు.