రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పాటు | state brahmin parishad to be estabilshed, ramana chary to head | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పాటు

Jan 29 2017 1:43 AM | Updated on Sep 5 2017 2:21 AM

రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పాటు

రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పాటు

రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది.

రమణాచారి చైర్మన్‌గా 17 మందితో నియామకం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని చైర్మన్‌గా.. మొత్తం 17 మంది సభ్యులతో ఈ పరిషత్‌ను ప్రకటించింది. 2001 తెలంగాణ సొసైటీస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం కింద బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ వైస్‌ చైర్మన్‌గా సీఎం సీపీఆర్వో జ్వాలా నరసింహారావు, కోశాధికారిగా సీఎల్‌ రాజంను నియమించారు.

సభ్యులుగా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డాక్టర్‌ వేణుగోపాలాచారి, పురాణం సతీశ్, మృత్యుంజయశర్మ, అష్టకాల రామ్మోహన్‌రావు, చకిలం అనిల్‌కుమార్, జోషి గోపాలశర్మ, భద్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, ఎం.వెంకటరమణ శర్మ ఉంటారు. వీరితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి, దేవాదాయ శాఖ కార్యదర్శి కూడా సభ్యులుగా కొనసాగుతారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ మెంబర్‌ సెక్రెటరీగా ఉంటారు.

శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ వైస్‌ చైర్మన్‌గా సీఎం సీపీఆర్వో జ్వాలా నరసింహారావు, కోశాధికారిగా సీఎల్‌ రాజంను నియమించారు. సభ్యులుగా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డాక్టర్‌ వేణుగోపాలాచారి, పురాణం సతీశ్, మృత్యుం జయశర్మ, అష్టకాల రామ్మోహన్‌రావు, చకిలం అనిల్‌కుమార్, జోషి గోపాలశర్మ, భద్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, ఎం.వెంకటరమణ శర్మ ఉంటారు. వీరితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి, దేవాదాయ శాఖ కార్యదర్శి కూడా సభ్యులుగా కొనసాగుతారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ మెంబర్‌ సెక్రెటరీగా ఉంటారు.

Advertisement

పోల్

Advertisement