కాంగ్రెస్ నేతల సమీక్ష రసాభాస | stampede at congress review meet in gandhi bhavan | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతల సమీక్ష రసాభాస

Dec 21 2014 3:26 PM | Updated on Mar 18 2019 7:55 PM

గాంధీభవన్ లో ఆదివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది.

హైదరాబాద్:గాంధీభవన్ లో ఆదివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ  నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియాలు సమావేశమైయ్యారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్, మహేష్ కుమార్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

తాను పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో జోక్యం చేసుకుంటారని డీఎస్ ను మహేశ్ ప్రశ్నించాడు. దీంతో ఇరువురు నేతలకు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
 
Advertisement
Advertisement