అదరహో! | St. Peter's college student racing car manufacturing | Sakshi
Sakshi News home page

అదరహో!

Sep 4 2014 11:55 PM | Updated on Mar 28 2018 11:08 AM

మండలంలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలవిద్యార్థులు తక్కువ బడ్జెట్‌తో రేసింగ్ కారును తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

మేడ్చల్ రూరల్: మండలంలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలవిద్యార్థులు తక్కువ బడ్జెట్‌తో రేసింగ్ కారును తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మెకానికల్ విభాగంలో 3వ, 4వ సంవత్సరం చదువుతున్న 27 మంది విద్యార్థులు ఈ కారును రూపొందించారు. దీనిని గురువారం ప్రదర్శించారు.

 ఈ సందర్భంగా కళాశాల డెరైక్టర్ సరోజారెడ్డి మాట్లాడుతూ... ఈ సంవత్సరం జనవరి నెలలో భువనేశ్వర్‌లో సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్‌ఏఈ) ఆధ్వర్యంలో రేసింగ్ కార్ల తయారీ కోసం ‘సుప్ర 2014’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమ కళాశాల విద్యార్థులకు కారు తయారు చేయడానికి అనుమతి లభించిందని తెలిపారు. తక్కువ ధరతో రేసింగ్ కారును తయారు చేయడానికి విద్యార్థులు నానో కారు ఇంజిన్‌కు ఇతర విడి భాగాలు అమర్చారని, రూ. లక్షా 97 వేల ఖర్చుతో కారును తయారు చేశారన్నారు.

ఎస్‌ఏఈ సంస్థ తిరిగి గత జుైలై నెలలో చెన్నైలో కార్ల ప్రదర్శన నిర్వహించంగా.. అందులో పాలుపంచుకున్న తమ విద్యార్థుల కారు అతి తక్కువ ధరతో తయారైన కారుగా నిలిచిందన్నారు. 590 సీసీతో రూపొందిన ఈ కారును రిమోబుల్ స్టీరింగ్, సస్పెన్షన్ సిస్టమ్‌తో పూర్తి స్థాయిలో తయారుచేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల పిన్సిపాల్ డాక్టర్ ఈఎల్ నగేష్, అధ్యాపకుడు నాగేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement