
మేడ్చల్: పోచారంలో కాల్పుల కలకలం రేగింది. ఈ రోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) సాయంత్రం సమయంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఇబ్రహీం పరారయ్యాడు.
ప్రస్తుతం ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్ సింగ్ సోనూ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులకు తెగబడ్డాడు. ప్రశాంత్ సింగ్ సోనూ గోవుల రక్షణ చేస్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. కాల్పుల బారిన పడ్డ ప్రశాంత్ సింగ్ పరిస్థితి ఎలా ఉందనేది, అసలు కాల్పులు ఎందుకు జరిపాడనే విషయాలు తెలియాల్సి ఉంది.