breaking news
St. Peters Engineering College students
-
పల్లెకు పోదాం..పనులే చేద్దాం..
సచిన్ టెండూల్కర్.. స్టేడియంలో పరుగుల హీరో.. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ హీరో.. క్రికెట్ హిస్టరీలో ఎవర్గ్రీన్ హీరో..! కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ భారతరత్నం.. నెల్లూరు జిల్లాలోని పీఆర్ కండ్రిగ గ్రామవాసులకు మాత్రం రియల్ హీరో. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ అందరికీ ఆదర్శం అంటున్నారు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి పల్లెకు వెళ్లి సేవ చేయాలంటున్నారు. వాసంతి: సచిన్ టెండూల్కర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తన ఊరు, రాష్ట్రం వదిలిపెట్టి తెలుగు రాష్ట్రానికి వచ్చి అదీ ఓ మారుమూల గ్రామాన్ని అడాప్ట్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఐ రియల్ థ్యాంక్ టు సచిన్. నిఖిల్: ముందుగా మన పీఎమ్ మోదీకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్క ఎంపీ ఒక విలేజ్‌ను దత్తత తీసుకుని పని చేయాలనే నిర్ణయం గొప్పది. విలేజ్ డెవలప్మెంట్ మీదే ఇండియా ఫ్యూచర్ ఆధారపడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కదా..! వర్గేష్: కరెంట్ అంటే ఏంటో తెలియని గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయి. సచిన్ దత్తత తీసుకున్న పీఆర్ కండ్రిగ గ్రామం నెల్లూరు సిటీకి పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా అక్కడ కనీసం శానిటేషన్ లేదు. సరైన రోడ్లు కూడా లేవు. వాసంతి: ఇందులో వింతేముంది. అలాంటి గ్రామాలు వేలల్లో ఉన్నాయి. మా బంధువుల ఊళ్లకు వెళ్లినపుడు.. ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయా అనిఅనిపిస్తుంటుంది. దుర్గాప్రసాద్: అవును.. గ్రామాల్లో ఒక్క రోడ్డు రావాలంటే పదేళ్లుపడుతుంది. శానిటేషన్ అక్కడ ఒక పెద్ద సమస్య. సచిన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని తోటి ఎంపీలకే కాదు.. ప్రతి ఇండియన్‌కు ఆదర్శంగా నిలిచారు. దీప: గ్రామాలను బాగు చేయాలంటే సచిన్‌లా గొప్పవాళ్లం కానక్కర్లేదు. ఎంపీలు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థాయిలో వారు రెస్పాండ్ అయితే చాలు. అఖిల్: ఎగ్జాట్లీ.. దీప. నా ఒపీనియన్ కూడా అదే. ఎవరి వంతు సాయం వారు చేయొచ్చు. దీప: నీకేదైనా ఐడియా వస్తే చెప్పు... అఖిల్: సపోజ్.. ఒక్కో కాలేజీ వాళ్లు ఒక విలేజ్‌ని అడాప్ట్ చేసుకోవాలి. మనకున్న తీరిక సమయాన్ని, పాకెట్ మనీని ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఉపయోగిస్తే మంచిది. దీని వల్ల మనకూ మంచి ఎక్స్పీరియన్స అవుతుంది. హేగల్: ఎక్సలెంట్ ఐడియా. పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీలు విలేజెస్ అడాప్ట్ చేసుకుంటే.. కేవలం ఆర్థిక సాయం మాత్రమే చేయగలరు. అదే మనమైతే అన్నీ దగ్గరుండి చూసుకోవచ్చు. వాసంతి: దీన్ని ఒక రూల్‌గా మార్చాలి. చదువుతో పాటు విలేజ్ డెవలప్‌మెంట్‌ని ఒక సబ్జెక్టుగా మార్చితే బాగుంటుంది. నిఖిల్: (నవ్వుతూ..) అప్పుడు ఎంచక్కా.. బుక్స్ పడేసి విలేజ్ వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. శ్రుతి: వాట్... నిఖిల్: నో.. నో సరదాగా అంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తే మన గ్రామాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది. అక్కడున్న మనుషుల ఆలోచన తీరును మార్చే ప్రయత్నం చేయొచ్చు. కల్యాణ్: ఫర్ ఎగ్జాంపుల్.. మన గ్రామాల్లో రైతుల ఆత్మహత్యల గురించి న్యూస్ వింటున్నాం. అగ్రికల్చర్ స్టూడెంట్స్ గ్రామాలకు వెళ్లి రైతులకు విత్తనాలు, ఎరువులు వంటి విషయాల్లో అవగాహన కల్పించడం కూడా విలేజ్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. నవ్య: సిటీజనాలకు గ్రామాలతో అనుబంధం పెంచే విధంగా చదువులు ఉండాలి. అప్పుడే గ్యాప్ తగ్గుతుంది. లేదంటే మన దేశంలో ప్రజలు రెండు జాతులుగా మిగిలిపోతారు. ఒకటి సిటీ పీపుల్, రెండోది విలేజ్ పీపుల్. నతాలియన్: సచిన్ చేసిన ఈ గొప్పపని అందరికీ ఆదర్శమే. దీన్ని మాలాంటి స్టూడెంట్స్ మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి. మనం కూడా అప్పుడప్పుడు పల్లెలకు వెళ్లి తోచిన సాయం చేయాలి. దాని వల్ల కలిగే ఆత్మతృప్తి మరెక్కడా దొరకదు. వన్స్ అగైన్ వీ ఆర్ ఆల్ థ్యాంక్ టు సచిన్. -
అదరహో!
మేడ్చల్ రూరల్: మండలంలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలవిద్యార్థులు తక్కువ బడ్జెట్‌తో రేసింగ్ కారును తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మెకానికల్ విభాగంలో 3వ, 4వ సంవత్సరం చదువుతున్న 27 మంది విద్యార్థులు ఈ కారును రూపొందించారు. దీనిని గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల డెరైక్టర్ సరోజారెడ్డి మాట్లాడుతూ... ఈ సంవత్సరం జనవరి నెలలో భువనేశ్వర్‌లో సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్‌ఏఈ) ఆధ్వర్యంలో రేసింగ్ కార్ల తయారీ కోసం ‘సుప్ర 2014’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమ కళాశాల విద్యార్థులకు కారు తయారు చేయడానికి అనుమతి లభించిందని తెలిపారు. తక్కువ ధరతో రేసింగ్ కారును తయారు చేయడానికి విద్యార్థులు నానో కారు ఇంజిన్‌కు ఇతర విడి భాగాలు అమర్చారని, రూ. లక్షా 97 వేల ఖర్చుతో కారును తయారు చేశారన్నారు. ఎస్‌ఏఈ సంస్థ తిరిగి గత జుైలై నెలలో చెన్నైలో కార్ల ప్రదర్శన నిర్వహించంగా.. అందులో పాలుపంచుకున్న తమ విద్యార్థుల కారు అతి తక్కువ ధరతో తయారైన కారుగా నిలిచిందన్నారు. 590 సీసీతో రూపొందిన ఈ కారును రిమోబుల్ స్టీరింగ్, సస్పెన్షన్ సిస్టమ్‌తో పూర్తి స్థాయిలో తయారుచేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల పిన్సిపాల్ డాక్టర్ ఈఎల్ నగేష్, అధ్యాపకుడు నాగేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.