ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి | srsp water should be released | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

Mar 10 2017 4:38 PM | Updated on Sep 5 2017 5:44 AM

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల శంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

దురాజ్‌పల్లి : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల శంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేసి జిల్లాలోని పంటలను కాపాడానికి కోరుతూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టులో 1,071 అడుగుల మేర నీరు ఉన్నా.. నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అనంతరం కలెక్టర్‌ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు గంటా నాగయ్య, సైదులు, కిరణ్, సంజీవరెడ్డి, గుండు వెంకన్న, బొడ్డు శంకర్, ఉమేష్, ఉప్పలయ్య, వెంకన్న, అంజయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement