తండ్రిని హత్య చేసిన తనయుడు | son murder his father | Sakshi
Sakshi News home page

తండ్రిని హత్య చేసిన తనయుడు

Jun 18 2016 12:16 AM | Updated on Sep 4 2017 2:44 AM

భూమి తనకు ఇవ్వకపోవడం తో ఉన్మాదిలా మారిన తనయుడు..

పోషణ కోసం ఉంచుకున్న  భూమి ఇవ్వాలని గొడవ
తల, మెడపై ఇష్టారాజ్యంగా కొట్టడంతో మృతి

 

గీసుకొండ : భూమి తనకు ఇవ్వకపోవడం తో ఉన్మాదిలా మారిన తనయుడు.. వృద్ధు డు అని కూడా చూడకుండా తండ్రిపై దాడికి దిగి హత్య చేసిన సంఘట న మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవారం ఉద యం జరిగింది. గీసుకొండ పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారుు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన వాంకుడోతు వాల్యా(75)కు ముగ్గురు కుమారులు ఉండగా తొమ్మిది ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎనిమిది ఎకరాల భూమిని ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చిన ఆయన తాను, తన భార్య పోషణ కోసం మిగిలిన ఎకరం సాగు చేసుకుంటున్నాడు. అరుుతే, ఆ ఎకరం భూమి కూడా తనకు కావాలని రెం డో కుమారుడు నర్సింహ తరచూ వాల్యాను వేధించేవా డు. చివరకు డబ్బు చెల్లించి ఆ భూమి కొనుగోలు చేసేం దుకు నర్సింహ సిద్ధం కాగా.. పెద్దమనుషులు రూ.15లక్షలుగా ధర నిర్ణరుుంచారు. ఇందులో రూ.3లక్షలు చెల్లిం చిన నర్సింహ గడువు పూర్తరుునా మిగిలిన డబ్బు ఇవ్వలేదు. దీంతో అడ్వాన్స్ డబ్బును వాల్యా ఇచ్చేశాడు.


ఇది లా ఉండగా వర్షాకాలం కావడంతో వాల్యా తన భూమిని దున్నేందుకు గురువారం సిద్ధం కాగా నర్సింహ ఆ భూ మి తనకే దక్కుతుందంటూ గొడవ పడ్డాడు. ఇదే విషయాన్ని శుక్రవారం పెద్దమనుషులతో చెప్పుకోవడానికి వాల్యా వెళ్లగా వారు లేకపోవడంతో ఉదయం 8.15 గం టలకు తిరిగి వచ్చేశాడు. దీంతో అక్కడే ఉన్న నర్సింహ ఎక్కడికి వెళ్లావంటూ వాల్యాను ప్రశ్నిస్తూ చెప్పు తీసి తల, కణత, మెడపై కొట్టడమే కాకుండా, మరో చేయితో బలంగా మోదాడు. ఈ ఘటన లో వాల్యా అక్కడికక్క డే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని మామునూరు ఏసీపీ మహేందర్ పరిశీలించగా.. మృతుడి పెద్ద కుమారుడు బాలు ఫిర్యాదు మేరకు గీసుకొండ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement