సోషల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్.వి.రెడ్డి మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆళ్లూరు గ్రామాన్ని సందర్శించారు.
	హైదరాబాద్ : సోషల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్.వి.రెడ్డి మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆళ్లూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణలక్ష్మీ పథకం తీరుతెన్నులు గురించి ఆరా తీశారు. అంతేకాకుండా గ్రామంలో నూతనంగా వివాహం చేసుకున్న జంటకు కల్యాణలక్ష్మీ పథకం గురించిన పూర్తి వివరాలను తెలిపారు.  ఈ పథకం గురించి అధికారులు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ను సందర్శించారు.
	(చేవెళ్ల)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
