డిగ్రీ పూర్తికాగానే ధరణికి ఉద్యోగం | slain si siddhaiah's wife assured of job after graduation | Sakshi
Sakshi News home page

డిగ్రీ పూర్తికాగానే ధరణికి ఉద్యోగం

Jun 6 2015 5:59 PM | Updated on Sep 2 2018 5:06 PM

డిగ్రీ పూర్తికాగానే ధరణికి ఉద్యోగం - Sakshi

డిగ్రీ పూర్తికాగానే ధరణికి ఉద్యోగం

నల్లగొండ జిల్లాలో తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణికి డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు.

నల్లగొండ జిల్లాలో తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణికి డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. సిద్ధయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎస్ఐ సిద్ధయ్య తరఫున ధరణికి ఈలోపు పింఛన్, ఎక్స్గ్రేషియి అందిస్తామన్నారు.

 

నల్లగొండ జిల్లాలో ఉగ్రవాదుల ఆచూకీ తెలియగానే ఎస్ఐ సిద్ధయ్య ధైర్యంగా వెళ్లి వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. వాళ్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన తర్వాతే ఆయన భార్య ధరణి అదే ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement