Sakshi News home page

10 లక్షల మందితో సభ నిర్వహిస్తా: గద్దర్‌

Published Tue, Apr 25 2017 8:58 PM

10 లక్షల మందితో సభ నిర్వహిస్తా: గద్దర్‌

వరంగల్ : త్యాగాల తెలంగాణ సాధన కోసం ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో భువనగిరిలో పది లక్షల మంది తో భారీ  బహిరంగ సభ ను నిర్వహినున్నట్లు ప్రజా గాయకుడు  గద్దర్ ప్రకటించారు. " పల్లె పల్లెకు పాట - పార్లమెంట్ కు బాట "  అనే నినాదం తో త్యాగాల కుటుంబాలను కలుస్తూ కొత్త పార్టీ ప్రచారం కొనసాగిస్తాన్నాని  ఆయన చెప్పారు.

హన్మకొండ లో తెలంగాణ కోసం అసువులు బాసిన ఓ అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన గద్దర్  మీడియా తో మాట్లాడుతూ  దొరల నాయకత్వం వద్దని, కేసీఆర్ పై గద్దర్  పరోక్ష విమర్శలు చేశారు. బహుజన తెలంగాణ  సాధన కోసం సాగే ఉద్యమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని గద్దర్ పిలుపు నిచ్చారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ పిలుపు తో ఏమి సాధించలేరన్నారు.

మావోయిస్టుల లైన్ ను తప్పుపట్టడం కానీ వ్యతిరేకించడం కానీ చేయడం లేదన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజల మధ్య ఉండే నేతలను ఎన్నుకొనే విధంగా బడుగు బహు జనులను చైతన్య పరిచే కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ విషయం భవిష్యత్‌లో ప్రకటిస్తా: గద్దర్‌

 

Advertisement

What’s your opinion

Advertisement