సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక లాభాలుంటాయని వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు.
ఆసిఫాబాద్ : సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక లాభాలుంటాయని వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ‘ఆత్మ’ ఆధ్వర్యంలో ఆదర్శరైతులకు కిసాన్ గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మానవులకు కలిగే ఉపయోగాలు, రసాయనిక ఎరువుల వల్ల మానవుని ఆరోగ్యంపై కలిగే నష్టాలు వివరించారు.
బీటీఎం గురుమూర్తి మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆహార పంటలు సాగు చేయాలని సూచించారు. ఎరువులు సమతుల్యంతో వాడడం వల్ల సూక్ష్మధాతువులను నివారించవచ్చని పేర్కొన్నారు. సస్యరక్షణపై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్, కెరమెరి ఏవోలు ఖాదర్ హుస్సేన్, గోపికాంత్, ఏఈవోలు యాకూబ్, అఖిల్, రామకృష్ణ, ఆసిఫాబాద్, కెరమెరి మండలాలకు చెందిన ఆదర్శరైతులు పాల్గొన్నారు.