షర్మిల పరామర్శ యాత్రపై ఆసక్తి | Sharmila visitation pilgrimage of interest | Sakshi
Sakshi News home page

షర్మిల పరామర్శ యాత్రపై ఆసక్తి

Nov 19 2014 3:57 AM | Updated on Aug 11 2018 5:44 PM

దివంగత సీఎం వైఎస్ మరణానంతరం జిల్లాలో 16మంది గుండె ఆగి మరణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని పార్టీ అధినేత జగన్ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ...

దివంగత సీఎం వైఎస్ మరణానంతరం జిల్లాలో 16మంది గుండె ఆగి మరణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని పార్టీ అధినేత జగన్ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ అనివార్య కారణాలతో గతంలో వాయిదా పడింది. బాధిత కుటుంబాలను ఎట్టి పరిస్థితిల్లోనూ పరామర్శించి తీరాలనే భావన పార్టీలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకురాలు షర్మిల ‘పరామర్శ యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నారు.

డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ఈ యాత్రకు శ్రీకారం చుట్టనుండటాన్ని రాజకీయ పక్షాలు ఆసక్తితో గమనిస్తున్నాయి. జిల్లాలో సుమారు 300 కిలోమీటర్ల మేర సాగే పరామర్శ యాత్ర పూర్తి షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. పరామర్శ యాత్ర పార్టీ కేడర్‌కు స్ఫూర్తినిస్తుందని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఎన్నికలు లేనప్పటికీ ప్రజా సమస్యలపై ఉద్యమించడం ద్వారా ప్రజల మనసు చూరగొనాలని పార్టీ భావిస్తోంది. ప్రజల పక్షాన నిలబడతామనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా పార్టీ చిత్తశుద్ధిని చాటుతూ బలోపే తం చేస్తామని పార్టీ ముఖ్యుడు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement