కేసీఆర్‌ ఫ్యామిలీకే బంగారు తెలంగాణ : షబ్బీర్‌ అలీ

Shabbir Ali Slams On KCR Family In Nizamabad - Sakshi

హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు 

కాంగ్రెస్‌ మాటకు కట్టుబడి ఉండే పార్టీ 

ఎన్నికల ప్రచారంలో షబ్బీర్‌అలీ

సాక్షి, కామారెడ్డి రూరల్‌: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారు స్తానని చెప్పిన కేసీఆర్‌ అది ఆయన కుటుంబానికే లబ్ధి జరిగిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం మండలంలోని అడ్లూర్, ఇల్చిపూర్‌ల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలతో, బోనాలతో షబ్బీర్‌అలీకి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకుంటే కేసీఆర్‌ బంగారు తెలంగాణను ఆయన ఇంట్లోనే బందిచేశాడన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ 180 వాగ్ధానాలు చేశాడని, నాలుగున్నరేళ్లలో ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పింఛన్లు ఏమైనా వాళ్ల తాత జాగీరా, కేసీఆర్‌ ఇంట్లోంచి ఇస్తున్నాడ అని అన్నారు.

గోదావరి జలాలు, గ్రామానికో సబ్‌స్టేషన్, ప్రాణహి త చేవేళ్ల, డెయిరీ కళాశాల వంటి పనులు చేపట్టిన ఘనత తనదేనన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సయ్యద్‌ యూసుఫ్‌అలీ,  జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పెరుమండ్ల రాములు, యూత్‌ అధ్యక్షుడు ఉరుదొండ నరేష్, ఎంపీటీసీ సభ్యులు నిమ్మవిజయ్‌కుమార్‌రెడ్డి, ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, ఆనంద్‌రా వు, మాణిక్యరెడ్డి, సంతోష్, భూమయ్య, తిరుపతి, ప్రతాప్, నా గగౌడ్, జి బాలయ్య, పెంటగౌడ్, ధర్మగౌడ్, ఈశ్వర్, మహేష్, హన్మంతు, ముదాం నర్సింలు, బాల్‌నర్సాగౌడ్‌ పాల్గొన్నారు.

భారీ మెజార్టీతో గెలిపించుకుందాం 
కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీకి మద్దతుగా మండలంలోని దేవునిపల్లి, క్యాసంపల్లి, గర్గుల్, ఇస్రోజివాడి, అడ్లూర్, శాబ్దిపూర్, టే క్రియాల్‌ల్లో గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. మండల యూత్‌ అధ్యక్షుడు ఉరుదొండ నరేష్, నీలం వెంకటి, నీలం సుధాకర్, చెట్కూరి గంగారం, రియాజ్, మునీర్, నాగరాజు, నౌసిన్, నాగల్ల రాజయ్య, మర్కంటి స్వామి, మిద్దెల సాయిలు, కిరణ్‌కుమార్, బాలస్వామి, సాకలి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సాక్షి, భిక్కనూరు: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. షబ్బీర్‌అలీ హయాంలో మండల కేంద్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివ రించారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి లింబాద్రి, మాజీ సర్పంచ్‌లు సత్యంరెడ్డి, నాగభూషణంగౌడ్, మాజీ ఉపసర్పంచ్‌లు దయాకర్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, నాయకులు సుదర్శన్, సరస్వతి ప్రభాకర్, భూమయ్య, దశరత్, నర్సింలు, నీల అంజ య్య, లక్ష్మీనారాయణ, కల్లూరి సిద్దరాములు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top