'కేంద్ర బడ్జెట్‌ ఆశించిన స్థాయిలో లేదు'

Shabbir Ali Says,Central Budget Is Not UP To The Mark - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ

సాక్షి, కామారెడ్డి : కేంద్ర బడ్జెట్‌ ఆశించిన స్థాయిలో లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ అసహనం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం అంబానీ, అదానీలను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా ఇప్పటికీ రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబందు అందరికీ వర్తించడం లేదని, డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయకపోవడంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని షబ్బీర్‌ పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గ్రామ పంచాయితీలకు ఇస్తామన్న నిధులను విడుదల చేయకపోవడం కేసీఆర్‌ అసమర్థ పాలనను సూచిస్తుందని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top