రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి | seven dead in road accident near addakula | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

Jan 27 2015 7:39 AM | Updated on Sep 2 2017 8:21 PM

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన ఇన్నోవా, మహారాష్ట్రకు చెందిన టవేరా వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగంగా ఢీకొనటంతో వాహనాలు నుజునుజ్జు అయ్యాయి.

ప్రమాదంలో కేరళకు చెందిన ఒక మహిళ, మహారాష్ట్ర వాసుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కార్లలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మహారాష్ట్ర వాసులు తిరుపతి నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement