కుప్పకూలిన యుద్ధ విమానం, ఏడుగురి మృతి

Seven dead as WWII-era plane crashes in US  - Sakshi

వాషింగ్టన్  : అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్‌లోని బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నిన్న (బుధవారం, అక్టోబర్ 2) ఉదయం 9:54 గంటలకు ఈ  ప్రమాదం చోటు చేసుకుంది. 

రెండవ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానంలో టేకాఫ్ అయిన పదినిమిషాలకే  సాంకేతి కసమస్య తలెత్తింది.  వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎమర్జన్సీ ల్యాండింగ్‌నకు యత్నిస్తున్న సమయంలోనే కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నారని ప్రజారక్షణశాఖ కమిషనర్ జేమ్స్ రోవెల్లా వెల్లడించారు. ఈ విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడ్డాడనీ..విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించిందనీ తెలిపారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోందని  తెలిపారు. దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటల పాటు మూసివేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top