పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం సీట్లు ఖాళీ | seats allotment for polycet candidates | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం సీట్లు ఖాళీ

Jun 2 2016 8:44 PM | Updated on Sep 4 2017 1:30 AM

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం వరకు సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సగం వరకు సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. పాలిసెట్‌లో అర్హులైన అభ్యర్ధులకు  గురువారం సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అలాట్‌మెంట్ పూర్తి చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 1,08,989 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఇందులో 48,975 మంది ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చారు. వీరిలో 47,116 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరంతా వివిధ కాలేజీల్లోని కోర్సులకు 8,87,939 ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 85 ప్రభుత్వ, 230 ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం సీట్లలో 83,617 కన్వీనర్ కోటా సీట్లుండగా 44,609 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 16,650 సీట్లలో 14,985 (90.81 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని 66,967 సీట్లలో 29,624 (44.23 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement