రైతులను నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్‌ చేస్తా

Sangareddy Collector Hanumantha Rao Gave Suspension Warning To The Govt Officers If They Neglect Farmers - Sakshi

 ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు  

 కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరిక   

సాక్షి, సంగారెడ్డి: రైతులకు సంబంధించిన భూముల రికార్డు పనుల్లో కాలయాపన చేసే వారిని సస్పెండ్‌ చేస్తానని  కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం కంది మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఇయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందరర్భంగా కార్యాలయంలోని భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రైతులకు అవసరమైన పాసు పుస్తకాలు, రికార్డులను త్వరగా అందజేసేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు.  రైతులు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా తయారైన పాసు పుస్తకాలను తహసీల్దార్లే  గ్రామాలకు వెళ్లి అందజేయాలన్నారు. కోర్టు కేసుల వివరాలను రిజిస్టర్‌లో పొందుపర్చాలని సూచించారు. వీఆర్‌ఓలు తమ వద్ద పట్టా పాసు పుస్తకాలను ఉంచుకోకూడన్నారు. మ్యుటేషన్లను పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. అవసరమైన సరి్టఫికెట్లను  24 గంటల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిఖం భూములు, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే సహించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు తమ పేరున ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను అందజేసేందుకు వీఆర్‌ఓ కాలయాపన చేస్తున్నారని ఉత్తర్‌పల్లికి చెందిన ఓ రైతు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ రైతులను ఇబ్బంది పెడుతూ రికార్డులు అందజేయడంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్‌ చేస్తానని వీఆర్‌ఓ శంకరయ్యను హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమాదేవి, నాయబ్‌ తహసీల్దార్‌ సల్ల మల్లయ్య, ఆర్‌ఐ సంతో‹Ùకుమార్, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.   

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌  
పటాన్‌చెరు టౌన్‌: ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్‌ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్‌ హనుమంత రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచి్చన రోగులను, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్ని కేసీఆర్‌ కిట్లు  పంపిణీ చేశారని, రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ప్రసవాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారంగా మొత్తం  కాన్పుల్లో 15 శాతం సాధారణమైనవి ఉంటేనే హెల్తీ ఇండెక్స్‌ కింద సూచిస్తుందని తెలిపారు. దాని ప్రకారంగా మన జిల్లాలో 25 శాతం వరకు ఉందన్నారు. రాష్ట్రంలో మనం బెస్ట్‌గా ఉన్నామని చెప్పారు. అయినప్పటికి 15 శాతానికి తీసుకురావాలన్నారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్‌ పని తీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, పటాన్‌చెరు తహసీల్దార్‌ మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top