ప్రతిభకు పట్టం కడదాం  | Sakshi Excellence Awards Invitation Are Opened | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పట్టం కడదాం 

Mar 17 2019 12:44 AM | Updated on Mar 17 2019 12:44 AM

Sakshi Excellence Awards Invitation Are Opened

ప్రతిభ ఏదైనా.. పట్టం కడదాం.. రంగం ఏదైనా.. ప్రతిభే కొలమానం. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్స్‌లెన్స్‌ అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతి భ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. వెలికి తీస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన జ్యూరీ ‘సాక్షి’కి వచ్చిన ఎంట్రీల నుం చి విజేతలను ప్రకటిస్తోంది. 2018కి సం బంధించి ‘సాక్షి’అవార్డుల ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. 2019, మార్చి 30 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎంట్రీలు అందుతున్నాయి. ప్రతిభను గుర్తించిన వారెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున ఎంట్రీలను పంప వచ్చు. విద్య, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సామాజిక సేవ, క్రీడలు, సినిమా తదితర రంగాల్లో రాణిస్తున్న వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేస్తారు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. కొందరికి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు.

అలాగే సినిమా రంగంలో ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం విభాగాల్లోనూ అవార్డులున్నాయి. నైపుణ్యాల్ని ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన ఉన్న వారంతా తమకు తెలిసిన ప్రతిభామూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలు పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది, ‘సాక్షి’చేస్తున్న ఈ కృషికి చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం www.sakshiexcellenceawards@sakshi.com లాగిన్‌ కావచ్చు. వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబర్‌పై సంప్రదించవచ్చు. 
ఈమెయిల్‌: sakshiexcellenceawards@sakshi.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement