breaking news
Awards of excellence
-
ప్రతిభకు పట్టం కడదాం
ప్రతిభ ఏదైనా.. పట్టం కడదాం.. రంగం ఏదైనా.. ప్రతిభే కొలమానం. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతి భ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. వెలికి తీస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన జ్యూరీ ‘సాక్షి’కి వచ్చిన ఎంట్రీల నుం చి విజేతలను ప్రకటిస్తోంది. 2018కి సం బంధించి ‘సాక్షి’అవార్డుల ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. 2019, మార్చి 30 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎంట్రీలు అందుతున్నాయి. ప్రతిభను గుర్తించిన వారెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున ఎంట్రీలను పంప వచ్చు. విద్య, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సామాజిక సేవ, క్రీడలు, సినిమా తదితర రంగాల్లో రాణిస్తున్న వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేస్తారు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. కొందరికి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. అలాగే సినిమా రంగంలో ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం విభాగాల్లోనూ అవార్డులున్నాయి. నైపుణ్యాల్ని ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన ఉన్న వారంతా తమకు తెలిసిన ప్రతిభామూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలు పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది, ‘సాక్షి’చేస్తున్న ఈ కృషికి చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం www.sakshiexcellenceawards@sakshi.com లాగిన్ కావచ్చు. వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబర్‌పై సంప్రదించవచ్చు. ఈమెయిల్: sakshiexcellenceawards@sakshi.com -
ప్రతిభా పురస్కారాలు
స్నేహ ఆర్ట్స్ అకాడమి తిరుపతి వారి ఆధ్వర్యంలో ప్రతిఏటా ప్రతిభా పురస్కారాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవ త్సరం కూడా పురస్కార గ్రహీతల ఎంపిక కోసం దరఖాస్తులని ఆహ్వా నిస్తున్నాము. ఇందుకుగాను సమాజానికి బహుముఖంగా తమ సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, కళాకారులు (నృత్యం) రచయితలు, రైతులు, పౌరోహిత్యం లాంటి వివిధ వృత్తులకు సంబంధించిన వారు ఈ పురస్కారం పట్ల ఆసక్తి ఉండీ, తగిన అర్హత కలిగి ఉంటే అలాంటి వారు తమ వివరాలని జతపరచి పంపాలని కోరుతున్నాము. ఈ పురస్కారాలకు అర్హులైన వారు ఫిబ్రవరి నెల 20వ తేదీలోపు తమ పూర్తి వివరాలని జతపరుస్తూ ఈ కింది చిరునామాకు పంపగలరని ఆశిస్తున్నాం. సమాజానికి మీరు అందిస్తున్న సేవలని గుర్తించి మీ సేవలని మరింత విస్తృత పరుస్తూ మీరు నలుగురికీ ఉపయోగకరమైన పనులను స్వచ్చందంగా ఇకముందు కూడా నిర్వహించేందుకు గాను ప్రోత్సాహకంగా ఈ పురస్కారాలని మీకు అందించే ప్రయత్నమే మా స్నేహ ఆర్ట్స్ అకాడమి ఆలోచన. మీ పూర్తి చిరునామా, సామాజిక సేవలో మీ పాత్ర వివరాలను 2015 ఫిబ్రవరి 20 లోపు ఈ కింది చిరునామాకు పంపగలరు. - కార్యదర్శి, స్నేహ ఆర్ట్స్ అకాడమి. 13-5-531/ఎ. టాటానగర్, పశువైద్యశాల ఎదురుగా, తిరుపతి. మొబైల్: 9703234092