‘పౌరసేవల చట్టం’పై నేడు రౌండ్‌టేబుల్: లోక్‌సత్తా | Round table meeting to be held on Citizen services law today | Sakshi
Sakshi News home page

‘పౌరసేవల చట్టం’పై నేడు రౌండ్‌టేబుల్: లోక్‌సత్తా

Dec 9 2014 7:54 AM | Updated on Mar 9 2019 3:05 PM

‘హక్కుగా పౌరసేవల చట్టం’ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని ‘సెస్’ సెమినార్ హాల్‌లో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశంతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు లోక్‌సత్తా పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

సాక్షి, హైదరాబాద్: ‘హక్కుగా పౌరసేవల చట్టం’ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని ‘సెస్’ సెమినార్ హాల్‌లో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశంతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు లోక్‌సత్తా పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. సామాన్య ప్రజలకు రోజువారీ జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన రేషన్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, మంచినీటి కనెక్షన్లు వంటి సేవలను అవినీతి, ఆలస్యం లేకుండా కచ్చితంగా అందించేందుకు వీలుగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు లోక్‌సత్తా తెలంగాణ కన్వీనర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు.

ఈ నెల 14న విశాఖపట్టణంలోనూ రౌండ్‌టేబుల్ సమావేశం ఉంటుందన్నారు. సెస్‌లో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో సీహెచ్ రాజేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్, జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, కళానిధి సత్యనారాయణ, ప్రొ.హనుమంతరావు, ప్రొ. సి.లక్ష్మణ్ణ, అన్వర్ ఖాన్, డా.చక్రపాణి, ఎం.ధర్మారావు, డా. టి.హనుమాన్‌చౌదరి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement