పార్క్ చేసి ఉంచిన నాలుగు కార్ల అద్దాలు పగులగొట్టి విలువైన టేప్ రికార్డర్లు, స్పీకర్లను ఎత్తుకెళ్లారు.
నిజామాబాద్ టౌన్ : పార్క్ చేసి ఉంచిన నాలుగు కార్ల అద్దాలు పగులగొట్టి విలువైన టేప్ రికార్డర్లు, స్పీకర్లను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలోని మహలక్ష్మీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహాలక్ష్మీనగర్‌లోని ఒక రోడ్డులో డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో కార్ల యజమానులు వీధిలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో శనివారం కార్లను పక్కనే రోడ్డుపై పార్క్ చేసి వెళ్లారు.
కాగా ఆదివారం తెల్లవారుజామున వచ్చి చూడగా కార్ల అద్దాలు పగులగొట్టి ఖరీదైన టేప్ రికార్డర్లు, స్పీకర్లు మాయమైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.