రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Road Accident Young Man Died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Apr 6 2018 11:24 AM | Updated on Sep 28 2018 3:39 PM

Road Accident Young Man Died - Sakshi

రాజేశ్‌ మృతదేహం

నిర్మల్‌రూరల్‌ : నిర్మల్‌రూరల్‌ మండలంలోని చిట్యాల్‌ బస్టాండ్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు రూరల్‌ ఎస్సై రాజు తెలిపారు. దిలావర్‌పూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌ తండాకు చెందిన జాదవ్‌ రాజేశ్‌ (25) గ్రామంలో మేస్త్రీ పని చేస్తుండే వాడు. గురువారం నిర్మల్‌ నుంచి తన గ్రామానికి సిమెంట్‌ బస్తా బైక్‌పై తీసుకువెళ్తుండగా చిట్యాల్‌ వద్ద ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో రాజేశ్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement