1,917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు

Replace of 1,917 posts soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మంగళవారం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలసి 2016–17కి సంబంధించిన సంస్థ వార్షిక నివేదికను అందజేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 40,921 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని, 93 నియామక ప్రకటనలు, 28 శాఖాపర, ఆర్‌ఐఎంసీ, సీఏఎస్‌ ప్రకటనలు కలిపి మొత్తం 121 ప్రకటనలు జారీ చేశామన్నారు.

ఇప్పటివరకు 128 గ్రూప్‌–1 పోస్టులు, 36,076 ఇతర పోస్టులు కలిపి మొత్తం 36,204 పోస్టుల భర్తీకి ప్రకటనలిచ్చామని తెలిపారు. 12,749 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని తెలిపారు. 20,360 పోస్టులకు సంబంధించిన ఫలితాల ప్రకటనల జారీ/ నియామక పరీక్షల తర్వాతి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 3,095 పోస్టులకు సంబంధించిన నియామక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని, 1,917 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేయాల్సి ఉందన్నారు. 2,343 పోస్టుల నియామక ప్రకటనలను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించుకుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top