
అవయవ దానంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడంతో పాటు మరణానంతరమూ జీవించవచ్చని సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ పేర్కొంది. గురువారం నగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రకుల్..
తానూ అవయవ దానం చేస్తున్నట్టు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది. నగర ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 26న నిర్వహించే 10కే రన్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.