జూలైలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

Rain Percent Down in August Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో జూలైలో 31 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వరుసగా వర్షాలు కురిసినప్పటికీ సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. జూన్‌ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు సాధారణంగా నగరంలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు 193.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది.  పలు మండలాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. షేక్‌పేట్‌ మండలం మినహా అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యధికంగా ముషీరాబాద్‌లో 42.4 శాతం, అంబర్‌పేటలో 40.4 శాతం, మారేడ్‌పల్లిలో 37.5 శాతం, తిరుమలగిరిలో 50.6 శాతం, బహదూర్‌పురాలో 49.3 శాతం, బండ్లగూడలో 47.6 శాతం మేర లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. ఒక్క షేక్‌పేట మండలంలో మాత్రం 3.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
జూన్‌ 1 – ఆగస్టు 1 వరకు గ్రేటర్‌లోనిమండలాల్లో వర్షపాతం వివరాలివీ 

వర్షపాతం మిల్లీ మీటర్లలో, లోటు శాతాల్లో..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top