కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత | Quarrel in Kamareddy Government Hospital | Sakshi
Sakshi News home page

కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

Aug 3 2015 5:27 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందతూ కామారెడ్డి ఆస్పత్రిలో సోమవారం మృతి చెందాడు.

కామారెడ్డి (నిజామాబాద్ జిల్లా) : ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందతూ కామారెడ్డి ఆస్పత్రిలో సోమవారం మృతి చెందాడు. ప్రమాదం వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం అర్ధరాత్రి ఆరుగొండ గ్రామ శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్, అంజయ్యలిద్దరినీ కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ఈ ప్రమాదంలోనే గాయపడిన అంజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సుధాకర్ మరణానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ అతని కుటుంబసభ్యులు అంజయ్యను సోమవారం ఆస్పత్రి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement