అధికారుల వేధింపుల నుంచి రక్షించండి | Protect from harassment by the authorities | Sakshi
Sakshi News home page

అధికారుల వేధింపుల నుంచి రక్షించండి

Dec 4 2014 5:15 AM | Updated on Sep 2 2017 5:34 PM

అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మంత్రి ఈటెల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు.

సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల అధికారులు కొందరు తమను వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దాల్‌మిల్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మంత్రి ఈటెల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. దాల్‌మిల్ వ్యాపారులు పలువురు సచివాలయంలో మంత్రిని కలసి తమ సమస్యలను వివరించారు.

అనంతరం అసోయేషన్ అధ్యక్షుడు మధు మీడియాతో మాట్లాడుతూ తమ ఇబ్బందుల పట్ల మంత్రి రాజేందర్ తక్షణం స్పందించారని, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికై చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement