breaking news
Rajinder spears
-
అధికారుల వేధింపుల నుంచి రక్షించండి
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల అధికారులు కొందరు తమను వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దాల్మిల్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మంత్రి ఈటెల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. దాల్మిల్ వ్యాపారులు పలువురు సచివాలయంలో మంత్రిని కలసి తమ సమస్యలను వివరించారు. అనంతరం అసోయేషన్ అధ్యక్షుడు మధు మీడియాతో మాట్లాడుతూ తమ ఇబ్బందుల పట్ల మంత్రి రాజేందర్ తక్షణం స్పందించారని, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికై చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. -
యువత రాజకీయాల్లోకి రావాలి
- మంత్రి ఈటెల శ్రీనగర్‌కాలనీ: దేశాభివృద్ధికి యువత నడుం బిగించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... యువత ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నారు. మెట్రోరైల్ ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి మాట్లాడుతూ... నేటి ఆధునిక జీవనంలో శాస్త్రీయ విధానాల ద్వారానే ఏ పనైనా జరుగుతుందని తెలిపారు. అనుకున్న దానికంటే 20 నెలల ముందే మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రికార్డును సృష్టిస్తామని వెల్లడించారు. కార్యక్రమలలో మెట్రో ఇండియా చైర్మన్ సి.ఎల్.రాజం, ప్రిన్సిపాల్ శాస్త్రి, పాఠశాల సిబ్బంది జితేందర్‌నాథ్, పురుషోత్తం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.