ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని అదృశ్యం | private employee mridula missing | Sakshi
Sakshi News home page

ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని అదృశ్యం

Jun 20 2015 5:10 AM | Updated on Sep 3 2017 4:01 AM

ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని అదృశ్యం

ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని అదృశ్యం

నల్లగొండ జిల్లాకు చెందిన పి.ఆంజనేయులు కుమార్తె పి.మృదుల హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ రెండేళ్ళుగా యూసుఫ్‌గూడలోని హాస్టల్‌లో ఉంటున్నారు.

హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన పి.ఆంజనేయులు కుమార్తె పి.మృదుల హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ రెండేళ్ళుగా యూసుఫ్‌గూడలోని హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ నెల 6న తన సోదరుడికి తాను వెళ్ళిపోతున్నట్లు సందేశం పంపిన మృదుల హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. నగరంలోని సంజీవ్‌రెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ఆంధ్రప్రదేశ్‌లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

సోదరుడితో పాటు తండ్రి ఆంజనేయులు సైతం హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అదృశ్యం వెనుక మృదుల పని చేస్తున్న సంస్థ నిర్వాహకుడైన వివాహితుడు మణికందన్ పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృదుల ఆచూకీ తెలిసిన వారు 9959553307, 9490616619, 040-27852386 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్సై ఎన్.నగేష్ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement