breaking news
Sanjeevareddy Nagar
-
ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని అదృశ్యం
హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన పి.ఆంజనేయులు కుమార్తె పి.మృదుల హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ రెండేళ్ళుగా యూసుఫ్‌గూడలోని హాస్టల్లో ఉంటున్నారు. ఈ నెల 6న తన సోదరుడికి తాను వెళ్ళిపోతున్నట్లు సందేశం పంపిన మృదుల హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. నగరంలోని సంజీవ్‌రెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ఆంధ్రప్రదేశ్‌లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సోదరుడితో పాటు తండ్రి ఆంజనేయులు సైతం హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అదృశ్యం వెనుక మృదుల పని చేస్తున్న సంస్థ నిర్వాహకుడైన వివాహితుడు మణికందన్ పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృదుల ఆచూకీ తెలిసిన వారు 9959553307, 9490616619, 040-27852386 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్సై ఎన్.నగేష్ కోరారు. -
భర్త ప్రాణం తీసిన భార్య నటన
* అసభ్యంగా నటించడంతో తీవ్ర మనస్తాపం * ఉరివేసుకొని ఆత్మహత్య హైదరాబాద్: భార్య ఓ లఘుచిత్రంలో అసభ్యంగా నటించడంతో తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికితోడు అత్తింటివారి వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఎస్సార్‌నగర్ సీఐ శంకర్ వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లాకు చెందిన బండారు ఉదయ్‌భాను(32) కొటక్‌మహీంద్రా కంపెనీలో పనిచేస్తూ అమీర్‌పేట సత్యం థియేటర్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి నివాసముంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాల నేపథ్యంలో భార్య లీలారాణి, 11 ఏళ్ల కూతురుతో గత రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. కాగా భార్య ఇటీవల ఓ లఘుచిత్రంలో అసభ్యకరంగా నటించడాన్ని భాను తట్టుకోలేకపోయాడు. కొన్నిరోజులుగా బాధపడుతుండడంతోపాటు అత్తింటి వారి వేధింపులు అధికమయ్యాయి. వీటిని భరించలేని భాను మంగళవారం ఉదయం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో గదికొచ్చిన స్నేహితులు తలుపులు తట్టగా లోపలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గట్టిగా తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే భాను మృతిచెంది ఉన్నాడు. పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘భార్య లఘుచిత్రంలో అసభ్యంగా నటించిందని, దీన్ని తట్టుకోలేకపోయానని, అత్తింటి వేధింపులు పెరగడంతో జీవితంపై విరక్తిచెందానని’ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.